ఆ బ్రోకర్‌కు చెప్తున్నా... డేట్ రాసుకో.. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పంపుతా... బీజేపీ అభ్యర్థికి కేతిరెడ్డి వార్నింగ్

ఠాగూర్

శనివారం, 4 మే 2024 (09:24 IST)
ధర్మవరం నియోజవర్గ సిట్టింగ్ వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలకు, అక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌కు బహిరంగ వార్నింగ్‌లు ఇస్తున్నారు. ధర్మవరంలో రాజకీయం చేయడానికి ఢిల్లీ నుంచి వచ్చారు.. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే పంపుతాం అంటూ హెచ్చరించారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా, కేతిరెడ్డి మాట్లాడుతూ, ధర్మవరంలో రాజకీయం చేయడానికి ఢిల్లీ నుంచి బ్రోకర్లు చ్చారు. అంతిస్తాం.. ఇంతిస్తాం అంటూ రాజకీయం చేస్తున్నారు. తాడు బొంగరం లేని వారు ఈ కేతిరెడ్డిని శాసిస్తారా? ఆ బ్రోకర్‌కు చెబుతున్నా.. డేట్ రాసుకో.. ఏ ఊరి నుంచి వచ్చారో అక్కడికే నెలలోపు పంపకపోతే నా పేరు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కాదు అంటూ మధ్యమధ్యలో పరుష పదజాలాన్ని ఉపయోగించారు. 
 
ఇదే ముదిగుబ్బ సెంటర్‌లో గత ఎన్నికలపుడు చెప్పా... మా వాళ్లను ముట్టుకుని పొలిమేర దాటలరేన్నా.. ఐదేళ్ల తర్వాత ఇదే చెప్తున్నా.. ఎవరైనా వచ్చారా.. ముట్టుకున్నారా.. అని కార్యకర్తలను ఉద్దేశించి అడిగారు. ఈ స్థానంలో పోటీ చేసేందుకు మొదటి సూరి, ఆ తర్వాత పరిటాల శ్రీరామ్, జనసేన అంటూ ఇంకొకరు వచ్చారు. పోయారు.. కొత్తగా ఢిల్లీ నుంచి వచ్చారు. అక్కడేం చేయలేని వారు ఇక్కడికొచ్చి ఏం చేయగలరు. ఒక్క కేతిరెడ్డిని ఎదుర్కొనేందుకు హీరోయిన్లు, కేంద్ర మంత్రులు వస్తున్నారు.. నేను నమ్ముకుంది జనాల్ని. కేవలం ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్ ఉండకూడదనే పదేళ్లుగా గొడవల్లేకుండా చూసుకున్నాం అని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు