హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల కేసు విచారణలో పరువు పోతోంది తెలుగు చిత్ర పరిశ్రమకా లేక తెలంగాణ రాష్ట్రానికా..అంటూ ప్రముఖ చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ మళ్లీ మండిపడ్డాడు. డ్రగ్స్ కేసు విచారణ అంటూ టాలీవుడ్ లోని కొంతమంది నటీనటులను, సాంకేతిక నిపుణులను విచారిస్తున్న తీరుతో మొత్తం తెలంగాణ ప్రతిష్టకే భంగం కలిగిందని వర్మ తన ఫేస్ బుక్‌లో తీవ్రంగా వ్యాఖ్యానించాడు. డ్రగ్స్ కేసుల కారణంగా పంజాబ్ కన్నా దారుణ స్థితిలో తెలంగాణా ఉందని ముంబైవాసులు అంటున్నారని వర్మ తెలిపాడు.
ముంబై ప్రజలు ఇంతవరకు తెలంగాణ రాష్ట్రం గురించి, టీఆరెస్, కేసీఆర్ గురించి చాలా మంచిగా చెప్పుకుంటూ వచ్చారని కానీ సిట్ పుణ్యమా అని వారు ఇప్పుడు డ్రగ్స్ గురించి ప్రశ్నలు వేసుకుంటున్నారని వర్మ ఎద్దేవా చేశాడు. అందుకే హైదరాబాద్, టీఆర్ఎస్, కేసీఆర్ ప్రతిష్టను పునరుద్ధరించాలని వర్మ చెప్పాడు.