గుంటూరు జిల్లా గొప్పతనం గురుంచి మీకు తెలుసా?

బుధవారం, 22 సెప్టెంబరు 2021 (08:16 IST)
పేర్లో ఊరు ఉందని గుంటూరును ఊరు అనుకున్నారేమో అది ఊరు కాదండి బాబు అది 'మా'చర్ల సహారా ఎడారి. తెనాలిలో కేరళ తేమ, పొన్నూరు లో కోన సీమ మాగాణి,తాడికొండలో టిబేట్ పీఠభూమి,పిడుగురాళ్లలో కోలేరాడో కన్సల్,వినుకొండలో ఆండీస్ పర్వత శ్రేణులు,బాపట్లలో మయాని బీచ్ లు,మంగళగిరిలో సమత్రా పర్వత శ్రేణి,తుళ్ళూరులో ఒoడ్రు నేలలు,సత్తేనపల్లి లో బ్లాక్ కాటన్, ఇలా అన్ని టైం జోన్లలోను వాతావరణ మృతిక రూపాలను కలగలుపుకున్న ఓ భూగోళం ఈ నా గుంటూరు.

యకసక్కాలు ఆడతారు,యటకాటారo తప్ప ఏమి లేనివాళ్ళం అనుకున్నార ,పులిహోర,బిస్కట్టు,మాసం,మాములుగా ఉండదు,కెవ్వు కేక లాంటి ప్రయోగాలను సృష్టించి సినిమాలకి, స్కిట్లకి, సాహిత్యానికి, సంగీతానికి, నుడికారాలు, జాతియాలు, పడికట్టు పదాలు, పంచ్ లు అందించి కలo పట్టుకున్న ప్రతివాడి నోటికి నాలుగు మెతుకులు అందించే అన్నపూర్ణ ఈ గుంటూరు.
 
ఎర్రి బాగులొల్లు ఎచ్చులోళ్లు అనుకున్నారేమో రాయల సీమ లో యేటకొడవళ్ళు ఉంటాయో ఉండవో కానీ పదేళ్ల క్రితం వరకు నాటు బాంబుల మోతలనీ పలనాడు చెపుతుంది,ఎలక్షన్ గెలవాలన్న,గెలిచిన సీటు ఐదేళ్లు ఉండాలన్న నిర్ణయించాలన్న, నరసరావుపేట నడి బొడ్డు సెంటర్ లో తొడకొట్టాలన్న ,టిఫిన్ బాంబులు తీసి నేలకొట్టేవాడే ఇక్కడ లీడర్. 

డబ్బాలు కొట్టుకోటం సెంటర్లలో బాతకాని వేయటమే తెలుసనుకుంటున్నార, చరిత్ర తెలియని  అమాయకులనుకుంటున్నార, అసలు చరిత్రే లేని అభాగ్యుల? క్రీస్తుకు 500 సంవత్సరాల క్రితం, ప్రతిపాల పుత్ర రాజ్యం మాసొంతం దాన్నే ఇప్పుడు భట్టిప్రోలు గా పిలుస్తున్నాం.

కుబేరుడు మా రాజు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, ఆనంద గోత్ర్రీకులు, విష్ణు కుoదనులు,కోట వంశీకులు,వేంగి చాలిక్యులు వంటి రాజ పరంపరల కు ఆశ్రయం ఇచ్చిన నేల ఇది,చరిత్ర చెప్పుకునే కర్మ మాకులేదు, ఘాటుగా ఉంటారు.

మోటుగా మాట్లాడతారు ఆధునికీకరణ తెలియని నాగరిక లేని ఊరు అనుకుంటున్నారా ,960km సముద్ర తీరం ఐన కూడా బ్రిటిష్ వారు మొదట స్కూళ్ళు, కాలేజీలు కట్టుకొనే అనువైన ప్రదేశం అని ఎంచుకున్న ఊరు ఈ గుంటూరు జిల్లా. మీరు దేశాలు దాటొచ్చు కాని దానికి కావలసిన చదువుల మూలం మాత్రం ఇక్కడే మొదలు.

జంక్షన్ లో మొదటి కోచింగ్ సెంటర్ గుంటూరు దే,ఇప్పుడున్న కార్పొరేట్ విద్య ను పరిచయం చేసి పేర్లు పెట్టిందే గుంటూరు.అసలు మీరు విమానాలు ఎక్కి ఖండాంతరాలు దాటి సుఖంగా బ్రతకటానికి మోసుకెళ్లే కారాలు,పచ్చళ్ళు,ఎయిర్ లైన్స్ నిబందలనుగుణంగా పాకింగ్ పాఠాలు నేర్పింది ఈ గుంటూరె.

పాకిస్థాన్ ప్రధాని పేరుతో జిన్నా టవర్ కట్టిన విశ్వనగరం ఈగుంటూరు.జగజ్జేత చంగీస్ ఖాన్ పేరుతో కొండవీడు దుర్గం చెరువు కింద ఓ పేటను కట్టిన ఎల్లలు లేని ఖిల్లా ఈ గుంటూరు.అసలు గుంటూరు ఒక ఊరు కాదు వడ్డి0చిన విస్తరి గోదావరి ఖని నుండి సూళ్లూరు పేట వరకు విస్తరించిన తెలుగు నేల నుండి పట్టేడు అక్షరం మెతుకులు వెతుక్కుంటూ వచ్చే విద్యార్థుల కోసం స్టూడెంట్ మెస్స్ లు చమటలు కక్కే ఆంటీ నే ఈ గుంటూరు.

ఘాటైన మిర్చి పండిస్తూ తీయనైన అంగలకుదురు పాల సపోటాలు తినిపిస్తుంది ఈ గుంటూరు. నడిబొడ్డున మిర్చి యార్డ్,ఊరు గుండెల నిండా మాలపురి కోవ, దట్టించుకున్న వైభోగమే ఈ గుంటూరు.
 
ఓ చెట్టున నిలబడిన చోట కదలకుండా ఉంటూనే రెండు రాష్ట్రాల వేలకొలది గుంటూరు పల్లెలని ఓడలు వేసిన మహా వృక్షమే ఈ గుంటూరు.రెండు రాష్ట్రాలు విడి పోతుంటే కూడ ఆ గుంటూరు గో బాక్ , గోoగుర గో బ్యాక్ అనే కీర్తిని విని ముసి ముసిగా నవ్వుకున్న సుయోధన సార్వభౌముడి వంటి పరిపక్వత విలన్ గుంటూరు. 
 
గుంటలో ఉంటుంది బురదతో ఈదుతుంది అనుకుంటున్నారా  నల్ల రేగడి భూముల్లో మొదటి సారి శ్రీనాధుడి చేత వ్యాపార పంటలు పండించిన నేల ఇది.వాన వస్తే మోకాల్లోతు దిగిపోయే భూముల్లో పొగాకు,పత్తి పండించి బ్రిటన్ మార్కెట్ ను ఇప్పటికి తన గుప్పెట్లో ఉంచుకున్న ఊరు ఈ గుంటూరు.

ఎందుకూ ఓర కాని భూములను సైతం రియల్ ఎస్టేట్స్ విలువను అద్ది ఎందరో జేబులు నింపి ,మరెందరో కడుపులు నింపింది గుంటూరు.రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం పునాదులు వేసింది ఈ గుంటూరు వాసులే అని మర్చిపోతే ఎలా .
 
గుంటూరు అంటే పొద్దున్నే 4గం  కు నిద్రలేచి తలుపులు తెరుచుకుని పల్లెటూరి కిరాణా షాపు నుండి రాత్రి 2కూడా ఇడ్లీలు వడ్డీ0చే సిటీ రైల్వే స్టేషన్,గుంటూరు కల్లాపి వాసనల కుగ్రామం,హైటెక్ హాస్పిటల్ల మెట్రో పాలిష్.వానొచ్చిన,వరదొచ్చిన,కరువొచ్చిన,సాయంత్రం 6 అయితే తోటి మనుషులను కలుపుకొని సెంటర్లలో నిలబడే స్నేహ నగరం.
 
అది పునుగుల సరాగం,బజ్జిల అనురాగం,పచ్చళ్ళ అనుబంధం,పలావుల దాoపత్యం.మీరు పైకి గెలు చేసేవన్నీ మాకు లెవే అని లో లోన కుల్లుకుంటు చూసి కిసుక్కున నవ్వే కన్నెపిల్ల మా గుంటూరు. దేశం మెత్తం మతాల పేరిట అల్లకల్లోలం అవుతుంటే ఖాసీం భాయ్ పలావు లేనిదే కాశీనాధ్ ఇంట్లో పెళ్లి జరగని నగరం గుంటూరు.కాళేయా మస్తాన్ దర్గా ఉరుసు కమిటీ సభ్యులు అంతా మందిరం నుండే సరాసరి వస్తారు.
 
గుంటూరు ఓ కటింగ్ ,చాయ్ ప్రేమ,గుంటూరు ఓ సినిమా పిచ్చి,గుంటూరు పలావు వ్యసనం,గుంటూరు మిర్చి బజ్జిల ఉన్మాదం,గుంటూరు అసలు సిసలు జీవితం.ఇక్కడ పుట్టి ఎక్కడో మీడియాలో పెరిగి మళ్ళొచ్చి ఇక్కడ గొప్పతనం తెలుసుకున్న గుంటడు గుంటూరి అభిమానం ఇదే నా మన అందరి గుంటూరు ..

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు