ఈ విషయం తెలిసిన వెంటనే వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు రంగంలోకి దిగి డీఎంహెచ్‌వో ఇంటి పరిసరాల్లో ఫాగింగ్, దోమల లార్వా నియంత్రణ చర్యలు చేపట్టారు. డాక్టర్ లక్ష్మయ్య నివసించే బృందావన్ గార్డెన్స్ పరిసర ప్రాంతాల్లో కూడా ఫాగింగ్, ఫీవర్ సర్వే చేపట్టారు.
కాగా, యూరాలజిస్ట్ డాక్టర్ అలపర్తి లక్ష్మయ్య డెంగీతో మృతిచెందిన విషయం తమ దృష్టికి వచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె.యాస్మిన్ వెల్లడించారు. డెంగీ నివారణకు చర్యలు చేపడతామన్నారు. కాగా, గుంటూరులో మరో ఇద్దరు వైద్యులు, ఒక వైద్య విద్యార్థి కూడా డెంగీతో బాధపడుతున్నారు.
అయితే, చాల మంది వైద్యులు డెంగీ రోగులకు కూడా సాధారణ రోగుల్లానే చికిత్సలు చేస్తున్నారు. దీనివల్ల వైద్యులు, సిబ్బంది డెంగీ బారిన పడుతున్నట్లు భావిస్తున్నారు.