ఈ రోజు రాత్రి 12.30 నుంచి 3.30దాకా సెల్‌ఫోన్‌ను తల దగ్గర పెట్టుకోకూడదా?

బుధవారం, 11 జనవరి 2017 (11:22 IST)
అంగారక గ్రహం విశ్వకిరణాలను ప్రసరించే అవకాశం ఉందని.. అందుచేత ఈ రోజు (బుధవారం) రాత్రి 12.30 నుంచి 3.30 దాకా సెల్ ఫోన్‌లను తల దగ్గర పెట్టుకోవద్దని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంగారక గ్రహం నుంచి ఎక్కువ మోతాదులో భూమి మీదకు విశ్వకిరణాలు ప్రసరించే అవకాశం ఉందని.. వీలైనంత దూరంలో సెల్ ఫోన్లను దూరంగా ఉంచండి. 
 
ఈ విషయాన్ని షేర్ చేయండంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఈ వదంతులు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా షికారు చేస్తున్నాయి. పల్లెల్లో చాలామంది వీటిని నమ్మి రాత్రి 9 గంటలకు సెల్‌ఫోన్లు స్విచాఫ్‌ చేసి పెట్టేస్తున్నారు. 
 
తెలంగాణలోని నిర్మల్‌ జిల్లాలో ఈ వదంతులు బాగా ఎక్కువగా వ్యాపించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కానీ, ఇవన్నీ వట్టి వదంతులేనని వీటిలో కొంచెం కూడా నిజం లేదని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. కావాలనే కొందరు ఇలా ప్రచారం చేస్తున్నారని వాటిని నమ్మొద్దంటున్నారు.

వెబ్దునియా పై చదవండి