పచ్చటి కాపురం. ఇరవై ఏళ్ళ పాటు సాగింది. అనుమానం పెనుభూతమైంది. ఆ కుటుంబంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు చివరకు భార్య ప్రాణాలను బలిగొంది. తాను ఎవరితోను అక్రమ సంబంధం పెట్టుకోలేదని భర్తతో వాదించినా ఉపయోగం లేకుండా పోయింది. చివరకు భర్త హంతకుడయ్యాడు. అతడి చేతిలో భార్య ప్రాణాలు కోల్పోయింది. పిల్లలు అనాథలుగా మారిపోయారు.
కడప జిల్లా చిన్నాయపల్లెకి చెందిన పుల్లారెడ్డి, బి.మఠం గ్రామానికి చెందిన నారాయణమ్మతో 30 యేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు ఉన్నారు. ఇంకా పెళ్ళిళ్ళు చేయలేదు. అయితే పుల్లారెడ్డికి అనుమానం ఎక్కువ.
తనకు ఇంట్లో బోర్ కొడుతోందని.. స్నేహితురాళ్ళని కలిస్తే తప్పేంటని ప్రశ్నించేది. అయితే పుల్లారెడ్డి మాత్రం ఈ సాకుతో ఎవరెవరినో తన భార్య కలుస్తోందని అనుమానించేవాడు. దీంతో రెండురోజుల క్రితం భార్య నిద్రిస్తున్న సమయంలో తల నరికాడు. ఆ తరువాత గోనె సంచిలో మృతదేహాన్ని కట్టేసి ఎవరికీ అనుమానం రాకుండా తెలుగు కాల్వలో పడేశాడు.