అప్పటికే మత్తులో ఉన్న ఆయన, దాన్ని తాను పట్టుకుంటానని చెప్పి ముందుకెళ్లాడు. పాములు పట్టడంలో ఏ మాత్రమూ అనుభవం లేని గోవిందరాజు, పామును పట్టే క్రమంలో దాని కాటుకు గురయ్యాడు. దీంతో ఆయన ఆస్వస్థతకు పాలుకాగా, స్థానికులు ఆసుపత్రికి తరలించారు. గోవిందరాజుకు ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించగా, ఆయన చేసిన పనికి నవ్వాలో, ఏడవాలో అర్థం కాలేదని స్థానికులు వ్యాఖ్యానించారు.