ఫిబ్ర‌వ‌రి 22, 23వ తేదీల్లో శ్రీవారి ఆలయాల వాచీల‌ ఈ-వేలం

శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (09:24 IST)
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీల‌ను ఫిబ్ర‌వ‌రి 22, 23వ తేదీల్లో రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ- వేలం వేయ‌నున్నారు. ఇందులో సిటిజ‌న్‌, హెచ్ఎంటి, రికో, టైటాన్‌,  క్యాషియో, టైమెక్స్‌, వెస్ట‌ర్‌, ఆల్విన్‌, టైమ్స్, సొనాట, ఫాస్ట్‌ట్రాక్ కంపెనీల వాచీలున్నాయి.
 
క్రొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 66 లాట్లు ఈ-వేలంలో ఉంచారు. ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రులో కార్యాలయం వేళల్లో, టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org లేదా రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించగలరు.
 
గ్యాలరీలను తనిఖీచేసిన అద‌న‌పు ఈవో
తిరుమలలో శుక్రవారం రథసప్తమి ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ మాడ వీధుల్లోని గ్యాలరీలను టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి తనిఖీ చేశారు.

వాహనసేవలను వీక్షించేందుకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉత్సవం జరిగేలా జాగ్రత్తలు వహించాలని టిటిడి ఇంజినీరింగ్‌, అన్నప్రసాదం, విజిలెన్స్‌ విభాగాల అధికారులకు అద‌న‌పు ఈవో పలు సూచనలు చేశారు.

భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన తాగునీరు, అన్న‌ప్ర‌సాదాల పంపిణీ, మ‌రుగుదొడ్ల వ‌ద్ద పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ త‌దిత‌ర అంశాల‌పై ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు.
 
అద‌న‌పు ఈవో వెంట టిటిడి ఎస్ఇ-2 నాగేశ్వ‌ర‌రావు, డెప్యూటీ ఈవోలు హ‌రీంద్ర‌నాథ్‌, నాగ‌రాజ‌, ఆరోగ్య‌శాఖ అధికారి డాక్ట‌ర్ ఆర్‌.ఆర్‌.రెడ్డి, విజివో బాలిరెడ్డి, క్యాటరింగ్‌ అధికారి జిఎల్‌ఎన్‌.శాస్త్రి, ఎవిఎస్వో గంగ‌రాజు త‌‌దిత‌రులు ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు