ఏపీలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు

మంగళవారం, 24 ఆగస్టు 2021 (15:26 IST)
ఏపీలోని పలు ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం భూప్రకంపనలు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోని భూకంపం సంభవించడంతో కోస్తా ప్రాంతాల్లో కలకలం రేగింది. 
 
మంగళవారం మధ్యాహ్నం 1.35 గంటల సమయంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.1గా నమోదైంది. ఈ భూప్రకంపనల ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. సముద్రానికి 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు