మరోవైపు ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ నేతలకు ఊహించని షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ స్పీకర్ కే.ఆర్ సురేష్ రెడ్డి పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఇంకా గులాబీ దళంలో చేరిపోయారు. తెలంగాణ కోసం తొలి నుంచి పోరాడిన టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చేందుకే కాంగ్రెస్‌ను వీడుతున్నట్టు సురేష్ రెడ్డి ప్రకటించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణకు ప్రస్తుత సమయంలో సమర్ధవంతమైన నాయకత్వం అవసరమని ఇందుకోసమే టీఆర్ఎస్‌కు మద్దతిస్తున్నానని ఆయన అన్నారు.