నైట్ కబ్బుల్లో వ్యభిచార దందా... క్లబ్ డ్యాన్సర్లే వ్యభిచారిణిలుగా...

సోమవారం, 30 జులై 2018 (11:17 IST)
ఢిల్లీ నగర శివారు ప్రాంతమైన గుర్‌గ్రామ్‌లోని నైట్ క్లబ్బుల్లో వ్యభిచార దందా కొనసాగుతోంది. క్లబ్బుల్లో డ్యాన్సర్లుగా ఉండే అమ్మాయిలో వ్యభిచారిణులుగా మారి ఈ రాకెట్ నిర్వహిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుతో నిఘా వేసిన పోలీసులు ఈ వ్యభిచార దందాను బహిర్గతం చేశారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గురుగ్రామ్‌లోని ఎంజీరోడ్డు షాపింగ్ మాల్స్‌లలో ఉన్న నైట్ క్లబ్బుల్లో వ్యభిచారం జోరుగా సాగుతుందని స్థానిక ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్థానికంగా ఉండే సహారా, ఎంజీఎఫ్ నైట్ క్లబ్బులపై పోలీసులు నిఘా పెట్టి ఆదివారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. 
 
ఈ సోదాల్లో వ్యభిచార దందా కొనసాగుతున్నట్టు నిర్ధారించారు. ముఖ్యంగా, క్లబ్ డాన్సర్లే వ్యభిచారం చేస్తున్నారని పోలీసుల తేల్చారు. దీంతో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లతోపాటు పోలీసు, ఎక్సైజ్ శాఖల అనుమతులతో సాగుతున్న నైట్ క్లబ్బుల్లో వ్యభిచారం దందా నిర్వహించడం గమనార్హం. 
 
దీంతో పోలీసులు గురుగ్రామ్‌లోని పది నైట్ క్లబ్బుల లైసెన్సులను రద్దు చేశారు. ఇలా లైసెన్సులు రద్దు చేసిన కబ్బుల్లో ప్రీజం, లప్సా, ఒడిస్సీ, సిడీ,ఇగ్నైట్, సహారా, కింగ్, లాన్, ఎంపైర్, క్వీన్, ఫాంటమ్ నైట్ క్లబ్బులు ఉన్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు