ప్రేమించి పెళ్ళి చేసుకున్న యువకుడు శారీరక, మానసికంగా వేధింపులకు గురిచేయడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏలూరు తంగెళ్ళమూడి ప్రాంతంలోని ఆళ్ళనాని కాలనీకి చెందిన టి.భువన చంద్రిక (23)కు ఫేస్‌బుక్ ద్వారా ఉప్పుటూరి సాయికిరణ్ పరిచయమయ్యాడు. వారి పరిచయం ప్రేమకు దారితీసింది. తర్వాత కొన్ని కారణాలతో వారిద్దరూ విడిపోయారు.
తర్వాత భువన చంద్రికకు ఆళ్ళనానికాలనీకి చెందిన ఎలక్ట్రీషియన్ బండి భాస్కరరావు పరిచయమయ్యాడు. వారిద్దరూ ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నారు. వివాహం తర్వాత ఆమెను రోజూ శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేయడంతో బాధితురాలు ఏలూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బండి భాస్కరరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.