తిరుమల ఘాట్‌లో ద్విచక్రవాహనాలకు సమయం పెంపు

శనివారం, 23 జనవరి 2021 (11:14 IST)
తిరుమల కొండకు ద్విచక్రవాహనాల అనుమతి సమయాన్ని టీటీడీ పెంచింది. గతంలో లాక్‌డౌన్‌ ముందు వరకు ఉదయం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు ఘాట్‌లో అనుమతించేవారు.

లాక్‌డౌన్‌తో కొంతకాలం ద్విచక్రవాహనాలను ఆపేశారు. దర్శనాలు మొదలుకాగానే స్థానికుల విజ్ఞప్తి మేరకు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాలను అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గత నెలలో ఉదయం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు మార్పులు చేశారు.

అయితే భక్తులతో పాటు స్థానికుల నుంచి విజ్ఞప్తులు వస్తుండటం, తిరుమలకు చేరుకునే వాహనాల సంఖ్య కూడా పెరుగుతుండటంతో ఉదయం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు ద్విచక్రవాహనాలను అనుమతించేలా టీటీడీ అధికారులు సోమవారం నిర్ణయించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు