ఇక్కడి పార్వేట మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.
ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు పలు అన్నమయ్య సంకీర్తనలను వీనులవిందుగా ఆలపించారు. శాక్సాఫోన్, డోలు, నాదస్వర వాయిద్య సంగీతం ఆకట్టుకుంది. అనంతరం గరుడ వైభవం హరికథ పారాయణం చేశారు.
ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, బోర్డు సభ్యులు శ్రీ మురళీకృష్ణ, ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాధ్, విజివో బాలిరెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డా. ఆర్.ఆర్.రెడ్డి, డెప్యూటీ ఈవోలు బాలాజి, నాగరాజ, డిఎఫ్‌వో చంద్రశేఖర్, ఆలయ పేష్కార్ జగన్ మోహనాచార్యులు, పోటు పేష్కార్ శ్రీనివాస్, ఎవిఎస్వోలు గంగరాజు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.