తొమ్మిదో తరగతి బాలికను గర్భవతి చేసిన కన్నతండ్రి

బుధవారం, 28 అక్టోబరు 2020 (17:22 IST)
మానవ సంబంధాలు పూర్తిగా మసకబారిపోతున్నాయి. వావివరసలు మర్చిపోతున్నారు. కామాంధులుగా మారిపోయి అకృత్యాలకు పాల్పడుతున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి తన కుమార్తెపై పాశవికంగా ప్రవర్తించాడు. ఆమెపై అఘాయిత్యం చేసి గర్భవతిని చేశాడు. తండ్రి అకృత్యాన్ని చివరకు పోలీసులకు తెలిపింది ఆ బాధిత బాలిక.
 
విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలో మల్కాపురం పోలీసు స్టేషన్‌కు ఒక బాలిక వచ్చింది. కొంతమంది స్వచ్ఛంధ సంస్థలతో కలిసి ఆమె వచ్చింది. తాను ఐదు నెలల గర్భిణి అని అందుకు కారణం తన తండ్రేనని చెప్పింది. దీంతో పోలీసులు బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించారు. 
 
మేము హుద్ హుద్ కాలనీలో నివాసముంటున్నాం. మా నాన్న రామచంద్రరావు కూలి పనిచేస్తున్నాడు. అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నేను నాన్న మాత్రమే ఇంట్లో ఉంటున్నాం. నాన్న రోజు తాగి ఇంటికి వచ్చేవాడు. అయితే ఆరు నెలల క్రితం మా నాన్న మద్యం మత్తులో నాపై బలాత్కారం చేశాడు.
 
ఆ తరువాత జరిగిన విషయం బయట చెప్పొద్దన్నాడు. ఇలా ప్రతిరోజు నాపై అత్యాచారం చేస్తూనే ఉన్నాడని బాలిక పోలీసుల ముందు వాపోయింది. ప్రస్తుతం తను ఐదు నెలల గర్భిణి అని తన స్నేహితురాలికి అసలు విషయం చెప్పడంతో స్వచ్చంధ సంస్ధలకు ఆమె చెప్పి నన్ను ఇక్కడకు తీసుకొచ్చినట్లు బాధితురాలు చెప్పుకొచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు