ఫ్యాన్‌కు ఉరేసుకుని గర్భిణీ ఆత్మహత్య.. కారణం అదేనా?

గురువారం, 22 అక్టోబరు 2020 (15:36 IST)
మహిళలపై జరుగుతున్న నేరాల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా హైదరాబాదులో అనుమానాస్పద రీతిలో ఓ గర్భిణి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్‌ నగర పరిధిలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన లీల కుమార్తె కృష్ణ ప్రియ (24) ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తుండేది. 
 
జగద్గిరిగుట్ట పాపిరెడ్డినగర్‌కు చెందిన శ్రవణ్‌కుమార్‌ జిమ్‌ నిర్వహిస్తున్నాడు. వీరిద్దరూ దూరపు బంధువులు కావడంతో కొన్నేళ్లు ప్రేమించుకున్నారు. నాలుగేళ్ల క్రితం ఓ వ్యక్తితో కృష్ణప్రియకు వివాహం కాగా అతనితో విడాకులు తీసుకుంది. అనంతరం శ్రవణ్‌కుమార్‌తో ఆమెకు వివాహం కాగా, ప్రస్తుతం కృష్ణప్రియ ఐదు నెలల గర్భిణి.
 
ఈ క్రమంలో బుధవారం రాత్రి కృష్ణప్రియ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. శ్రవణ్‌కుమార్‌, అతని కుటుంబసభ్యులు అదనపు కట్నం కోసం తమ కుమార్తెను వేధించడంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లి లీల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు