అమ్మఒడి పథకం కింద ఇస్తున్న నగదును వద్దనుకున్న వారికే ల్యాప్ టాప్‌లు ఇస్తామని ప్రభుత్వం వెల్లడించింది. డ్యుయెల్ కోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 500 జీబీ హార్డ్ డిస్క్, 14 అంగుళాల(ఇంచ్) స్క్రీన్, విండోస్ 10 (ఎస్టీఎఫ్ మైక్రోసాఫ్ట్), ఓపెన్ ఆఫీస్ (ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్)ల కాన్ఫిగరేషన్‌తో ల్యాప్‌టాప్‌లు అందించనుంది.
వీటికి మూడేళ్ల వారెంటీ ఉంటుంది. ల్యాప్‌టాప్‌లకు మెయిన్‌టెనెన్స్ సమస్యలు ఎదురైతే ఫిర్యాదు ఇచ్చిన వారంలోపు పరిష్కరించేలా సదరు కంపెనీకి షరతు విధిస్తున్నారు. ఏవైనా సమస్యలు వస్తే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం సూచించింది.