ఏపీలో 4,173 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,566 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 129మంది డిశ్చార్జ్ అయ్యారు. అలాగే విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని కలిపితే రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,834కు చేరింది.
గడిచిన 24 గంటల్లో 462 పాజిటివ్ కేసులు వచ్చాయి. అలాగే గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ముగ్గురు, గుంటూరులో ఒకరు, కడపలో ఒకరు కరోనాతో మరణించారు.
కొత్తగా నమోదైన 462 కేసుల్లో.. రాష్ట్రానికి చెందిన కేసులు 407. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 40 మందికి, విదేశాల నుంచి వచ్చినవారిలో 15 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 7,858 చేరినట్లుగా రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.