రానున్న రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

సోమవారం, 22 జూన్ 2020 (19:30 IST)
కొద్దిరోజులుగా తెలంగాణ పలు ప్రాంతాలలో నైరుతి రుతుపవనాల వల్ల అక్కడక్కడ వర్షాలు పడ్డాయి. రానున్న రెండు రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలియజేసింది.
 
ఉత్తర తీర ప్రాంతాలైన ఒరిస్సా తదిర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఎత్తు పెరిగేకొద్దీ నైరుతి రుతుపవనంగా మార్పు చెందుతుందనీ, ఫలితంగా సోమ, మంగళ వారాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం వున్నదని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల కదలిక కాస్త బలహీనంగా వుండటంతో ఈ నెల 24 వరకూ తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు