కాగా, ఏపీ సర్కారు తెచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టివేసింది. పైగా, రాష్ట్ర ఎన్నికల కమిషనరుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తిరిగి నియమించాలంటూ ఆదేశాలు జారీచేసింది. అయితే, జగన్ సర్కారు మాత్రం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
అక్కడ కూడా ఏపీ సర్కారుకు చుక్కుదురైంది. పైగా, ఏపీ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వలేదు. అలాగని, ఎస్ఈసీగా తిరిగి రమేష్ కుమార్‌నే నియమించాలన్న స్పష్టత ఇవ్వలేదు. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయం తీసుకుని, పిటిషన్ దాఖలు చేయనున్నారు.