కొత్త రూల్.. ఫుడ్‌ ప్యాకెట్లపై ఎక్స్​పైరీ డేట్​

గురువారం, 15 ఆగస్టు 2019 (11:06 IST)
ప్రస్తుతం మందు (మెడిసిన్​)లకు మాత్రమే ఎక్స్​పైరీ డేట్​ వేస్తుంటారు. ఆహార పదార్థాలకు తయారు చేసే తేదీని ఇచ్చినా, ఎక్స్​పైరీ డేట్​ మాత్రం ఇవ్వరు. ఇకపై, ప్యాకెట్లలో వచ్చే ఫుడ్డుకూ ఎక్స్​పైరీ తప్పనిసరి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్స్​పైరీ డేట్​ ఒక్కటే కాదు, దాంతో పాటు ‘బెస్ట్​ బిఫోర్​ డేట్​(అంటే, ఏ తేదీ లోపు వాడుకుంటే మరింత బాగుంటుందో చెప్పేది)’ కూడా వేయాల్సి వస్తుంది. ఫుడ్​ సేఫ్టీ అండ్​ స్టాండర్డ్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా (ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ) ఈ కొత్త రూల్స్​పై ప్రతిపాదనలు పెట్టింది. 
 
వినియోగదారులకు మరింత స్పష్టమైన సమాచారం, ఆరోగ్యవంతమైన ఫుడ్డును అందించడమే లక్ష్యంగా ఈ కొత్త రూల్స్​ను తయారు చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు, బెస్ట్​ బిఫోర్​ డేట్​ దాటితే దానిపై వినియోగదారుడు ‘డిస్కౌంట్​’ అడిగే అవకాశాన్ని కల్పించనున్నారు. తద్వారా ఆహార వృథాను అరికట్టే ప్రయత్నం చేయనున్నారు. ఇప్పటిదాకా ఎక్స్​పైరీ డేట్​ను నిర్ణయించే విధానాలేవీ లేకపోవడంతో, బెస్ట్​బిఫోర్​ డేట్​ దాటగానే వాటిని సంబంధిత కంపెనీలకు పంపించేస్తున్నారు. దీంతో కంపెనీలూ వాటిని నాశనం చేసేస్తున్నాయి. 
 
ఆ వృథాను తగ్గించడంలో భాగంగానే ఈ కొత్త రూల్స్​కు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ‘‘ఇలాంటి బెస్ట్​ బిఫోర్​ డేట్​ దాటిన ఫుడ్డు కూడా కొద్ది రోజుల వరకు తినేందుకు వీలుగానే ఉంటుంది. వాటిని నాశనం చేయడం వల్ల ఆహారం మొత్తం వృథా అయిపోతోంది. అందులో ఎక్కువగా పోషకాహారమే ఉంటోంది” అని ఓ అధికారి చెప్పారు. డేట్​ దగ్గర పడుతున్న సరుకులపై చాలా షాపులు ఆఫర్లు పెడుతూ అమ్మేస్తున్నాయని, అలాంటి సందర్భంలో వినియోగదారులు ఆ ఫుడ్డు ఎన్ని రోజుల వరకు వాడుకోవచ్చో అవగాహన కలిగి ఉండాలని అన్నారు. వాటిపై మరింత డిస్కౌంట్​ అడిగేందుకు వారికి అవకాశం కలుగుతుందన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు