ఎపిఎస్‌ఎస్‌డిసి ద్వారా ఆన్ లైన్ లో ఉచిత శిక్షణ

ఆదివారం, 13 డిశెంబరు 2020 (07:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) మార్కెట్లో డిమాండ్ ఉన్న వివిధ కోర్సుల్లో ఆన్ లైన్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కోర్సులను విద్యార్థులు, నిరుద్యోగ యువతతోపాటు అధ్యాపకులకు కూడా ఉపయోగపడేలా ప్రముఖ సంస్థల సహకారంతో ఈ ఆన్ లైన్ శిక్షణా కార్యక్రమాలను ఎపిఎస్‌ఎస్‌డిసి నిర్వహిస్తోంది.

ఈనెల 21వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఎపిఎస్‌ఎస్‌డిసి టోల్ ఫ్రీ నెంబర్ 18004252422 నంబర్ లో సంప్రదించవచ్చు. 
 
రాస్ప్బెర్రీ పై శిక్షణ:
ఈనెల 21 నుంచి జనవరి 4వ తేదీల్లో సాయంత్రం 6గంటల నుంచి 7గంటల వరకు ఆన్ లైన్ ద్వారా రాస్ప్బెర్రీపై శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణలో రాస్ప్బెర్రీ పై, ఎంబెడెడ్ సిస్టమ్ - రాస్ప్బెర్రీ పై, సెన్సార్స్, కమ్యూనికేషన్-ప్రోటోకాల్, డిస్ల్పే & మోటార్స్, ఎలెక్ట్రికల్ సిస్టం, రోబోటిక్స్ సిస్టం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రాస్ప్బెర్రీ పి బోనస్ వంటి అంశాలను తెలుసుకుంటాు.

ఆసక్తి ఉన్న బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ చదివిన విద్యార్థులు, అధ్యాపకులు, రీసెర్చర్లు హాజరుకావచ్చు. రిజిస్ట్రేషన్ లింక్: https://www.apssdc.in/ (or) shorturl.at/hMT46  
 
డాటా సైన్స్ & ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పై శిక్షణ
ప్రముఖ శిక్షణా సంస్థ నరేష్ టెక్నాలజీస్ సహకారంతో అధ్యాపకులు, డిగ్రీ, పీజి పూర్తి చేసిన, చదువుతున్న విద్యార్థులు, రీసెర్చర్లకు డాటా సైన్స్ & ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పై ఈనెల 21వ తేదీ నుంచి రాత్రి 7:30 నుంచి 9గంటల వరకు నాలుగు వారాలపాటు ఆన్ ద్వారా శిక్షణ ఎపిఎస్‌ఎస్‌డిసి ఇవ్వనుంది.

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, కంప్యూటర్ విజన్ డీప్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్, నాచురల్ లాంగ్వేజ్, డిప్లాయింగ్ ఎఐ ఇన్ హార్డ్ వేర్ విభాగాల్లో శిక్షణ ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.  https://www.apssdc.in/ (or) shorturl.at/nKMNQ

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు