రాష్ట్రంలో 2.92 లక్షల మండి డిగ్రీ చదువుతున్న విద్యార్థులున్నారని అంచనా. కళాశాలలకు వెళ్లి వేయడం వల్ల వీరందరికి త్వరగా వేయడం సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఆగస్టు 16కంటే ముందు ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు.
ప్రభుత్వ యాజమాన్యాల్లో పని చేస్తున్న 1,68,911 మంది ఉపాధ్యాయుల్లో ఈ నెల 22వ తేదీ నాటికి తొలి విడత వ్యాక్సిన్ 83,394 (49.37శాతం) మంది వేయించుకున్నారు రెండో విడత వ్యాక్సినేషన్ 59,056 (34.96శాతం) మందికి జరిగింది. ఒక డోసు పూర్తయిన వారికి రెండోది అసలు వేసుకోని వారికి తొలిడోసు టీకాను ఈ నెల 31లోగా వేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.