ఇకపై అన్ని వ్యవహారాలు ఆన్‌లైన్‌లోనే: మంత్రి బొత్స

శనివారం, 3 అక్టోబరు 2020 (09:03 IST)
టౌన్ ప్లానింగ్ విభాగంలో సంస్కరణలు తీసుకువచ్చామని, ఇకపై అన్ని వ్యవహారాలు ఆన్‌లైన్‌లోనే జరుగుతాయని మంత్రి బొత్స సత్యానారాయణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సామాన్య ప్రజలు ఇంటి నిర్మాణపు ప్లాన్ సులభంగా పొందేలా సరళీకరణ చేశామని, నిర్మాణరంగానికి ఊతమిచ్చేలా నిబంధనల్లో సడలింపులు చేశామన్నారు.
 
మరింత వేగంగా భవనాలు, లే అవుట్ల అనుమతుల జారీ జరుగుతాయని మంత్రి బొత్స తెలిపారు. ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు 400 శాతం టీడీఆర్ వర్తింపు ఉంటుందని, ఇకపై ఆన్‌లైన్‌లోనే టీడీఆర్‌ల జారీ ఉంటుందన్నారు.

పరిశ్రమల అంతర్గత రహదారులు, ఖాళీ స్థలాల నిబంధనల్లో సడలింపులు ఉంటాయన్నారు. అనధికార ప్లాట్లు, భవనాలు, లే అవుట్లలో రిజిస్ట్రేషన్లు బంద్ అన్నారు.

ప్రతి దరఖాస్తు దారు నుంచి ఫీడ్ బ్యాక్, పకడ్బందీగా తనీఖీలు ఉంటాయన్నారు. బిల్డింగ్ రూల్స్, లే అవుట్ నిబంధనల్లో సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి బొత్స వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు