పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చను ఎంపీ గల్లా జయదేవ్ ప్రారంభించారు. ఇప్పటికే లోక్‌సభలో అవిశ్వాస సమరానికి అధికార, విపక్షాలు సిద్ధమయ్యాయి. మాటల కత్తులు దూసుకోవడానికి వ్యూహాలకు పదును పెట్టుకున్నాయి.
ఇక అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించిన గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. భరత్ అనే నేను స్టోరీ లైన్‌తో అవిశ్వాసంపై చర్చ మొదలెట్టారు. ఏపీ ధర్మ పోరాటం చేస్తోందన్నారు. ఇది సంఖ్యాబలానికి, నైతికతకు మధ్య జరుగుతున్న పోరాటం అన్నారు. అపనమ్మకం, ప్రాధాన్యం ఇవ్వకపోవడం, న్యాయమైన డిమాండ్లు, ధర్మపోరాటం అనే నాలుగు అంశాలపై ఏపీ అవిశ్వాసం పెట్టిందని గల్లా జయదేవ్ తెలిపారు.