మ‌ద్యం మ‌త్తులో... ఆఫీసులో స‌హోద్యోగిపైకి ఎక్కి...ఛీ!

గురువారం, 12 ఆగస్టు 2021 (08:33 IST)
ప్ర‌భుత్వ ఉద్యోగి అంటే డీసెంట్ గా ఉండాలి. ప్ర‌భుత్వ కార్యాల‌యం అంటే ప్ర‌జల దేవాల‌యంలా భావించాలి. కానీ దాన్ని ఓ క్ల‌బ్బులా మార్చేశాడా అధికారి.

అంతే కాదు... అక్క‌డే ప‌డుకోవ‌డం...అక్క‌డే అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డం అత‌ని హాబీగా మారింది. పైగా ఆఫీసులోనే మందేసి, చిందేయ‌డం, స‌హోద్యోగుల‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డం ప‌రిపాటిగా మారింది. ఇంకేముంది... ఇదంతా చూసి ఔరా అనడ‌మే కాదు...ఏకంగా వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పెట్టేశారు.

విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం ఎంపిడిఓ రామచంద్రరావు వికృత చేష్ఠ‌లివి. ఎంపీడీవో కార్యాల‌యంలో నిత్యం ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ప‌నిచేయాల్సిన ఈ అధికారి ఆఫీసును ఓ క్ల‌బ్ లా మార్చేశాడు. అక్క‌డే తాగ‌డం, తిన‌డం మొద‌లెట్టాడు. అంతే కాదు... ఆ మ‌ద్యం మద్యం మత్తులో వికృత చేష్టలు కూడా ప్రారంభించాడు.

తాను చేస్తున్న ఆఫీసులోనే మ‌రో ప్రభుత్వ ఉద్యోగితో క‌లిసి, ఆఫీసులోనే ప‌డుకోవ‌డం...ఆపై మ‌గ స‌హోద్యోగితోనే వికృత చేష్ట‌లు చేయ‌డం ఆయ‌న‌కు ప‌రిపాటిగా మారింది. పైగా ఈ ఘ‌న కార్యాన్ని స‌ర‌దాగా వీడియోలు కూడా తీయించుకోవ‌డంతో... ఆలస్యంగా ఆ వీడియో వెలుగులోకి వచ్చింది.

విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం ఎంపిడిఓ రామచంద్రరావు ప్రభుత్వ కార్యాలయాన్ని క్లబ్ గా మార్చేశాడ‌ని స్థానికులు తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. పైగా స‌హోద్యోగుల‌తో ఈ వికృత చేష్ఠ‌ల్ని చూసి ఛీ కొడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు