జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణ రెడ్డి ఆకస్మిక మరణంపై గజల్ శ్రీనివాస్ తీవ్రమైన ఆవేదనకు గురయ్యారు. ఆయనతో వున్న అనుబంధాన్ని తలచుకుని ఉద్వేగానికి లోనయ్యారు. కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన తనను మానస పుత్రుడిగా చెప్పుకునేవారని గుర్తు చేసుకున్నారు. సినారె గజల్స్ లేకపోతే తనకు ఇంతటి ప్రాముఖ్యత వచ్చేది కాదన్నారు.
తను నారాయణరెడ్డి క్రియేషన్ అని అన్నారు. తన కోసమే సినారె గజల్స్ రాశారని, తనను ఎంతగానో ఆదరించారని అన్నారు. తన కుమార్తెకు కూడా ఆయన పేరే పెట్టుకున్నట్లు వెల్లడించారు. సినారె రాసిన గజల్స్ లేకపోతే గజల్ శ్రీనివాస్ అనేవాడు లేడంటూ ఉద్వేగానికి లోనయ్యారు.