Haivan shooting - Akshay Kumar
అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ రూపొందిస్తున్న సినిమా హైవాన్. సరికొత్త థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ప్రెస్టీజియస్ మూవీతో ఫస్ట్ టైమ్ నెగిటివ్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు అక్షయ్ కుమార్. తాజాగా హైవాన్ సినిమా లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్బంగా ఓ స్పెషల్ వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు అక్షయ్ కుమార్.