గిద్దలూరు ఎమ్మెల్యేకు కరోనా.. భార్యకు కూడా కోవిడ్

మంగళవారం, 4 ఆగస్టు 2020 (10:55 IST)
ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు. చాలామంది కోలుకున్నారు. తాజాగా.. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. లక్షణాలు కనిపించడంతో.. ఒంగోలులోని రమేష్ సంఘమిత్ర వైద్యశాలలో పరీక్షలు చేయించుకున్న అన్నా రాంబాబు, ఆయన సతీమణికి పాజిటివ్‌గా తేలింది.
 
ఇక, అనుమానంతో కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించగా.. అందరికీ నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కాగా, నెల రోజుల క్రితం ఎమ్మెల్యే మనవడికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఒంగోలులో చికిత్స పొందాడు. 
 
ప్రస్తుతం ఎమ్మెల్యే రాంబాబు, ఆయన భార్యకు పాజిటివ్‌గా తేలింది. మరోవైపు.. ఇటీవల ఆయన పుట్టినరోజు వేడుకలతో పాటు పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. దీంతో.. కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. సన్నిహితంగా మెలిగినవారు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు