కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న సందర్భంలో కరోనా సోకినవారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. కొంతమంది తమకు కరోనా లక్షణాలున్నా బయట చెప్పుకోలేక మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. తమకు కోవిడ్ 19 పాజిటివ్ వుందని తెలియగానే భయపడిపోతున్నారు. దాంతో ఒత్తిడి అధికమై అధి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటుంది.
అలాగే కోలుకున్న ప్రతి ఒక్కరు ప్లాస్మా దానం చెయ్యాలన్నారు. అది చాలామంది ప్రాణాలను కాపాడుతుందని, అలాంటి సేవలో మీ పాత్ర కీలకమైనదని తెలిపారు. వైరస్ సోకిన వారి పట్ల వివక్ష చూపరాదని, అందరూ కలిసి పోరాడి కరోనాను పారద్రోలాలని పిలుపునిచ్చారు.