ప్రతిపక్షంలో ఉన్నపుడు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకమని చెప్పిన వైసీపీ నేడు అధికారంలోకి వచ్చాక లాటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలు జరుపుతూ గిరిజన సంపదను దోచుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకురాలు గిడ్డి ద్వజమెత్తారు.
మంగళవారం నాడు జూమ్ యాప్ ద్వారా జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ...వైసీపీ నేతలు లాటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వుతున్నారు, తూర్పుగోదావరి జిల్లా, విశాక జిల్లాకు మద్యలో సరుగుడు పంచాయితీ లో వైసీపీ నేతల ఆద్వర్యంలో జరుగుతున్న బాక్సైట్ తవ్వకాల్ని టీడీపీ గిరిజన నేతలం వెలికితీశాం.
గిరిజన ప్రాంతాల్లో ఏ గ్రామానికైనా రోడ్లు వేయాలంటే పారెస్ట్ క్లియరెన్స్ తప్పని సరి. కానీ బాక్సైట్ తవ్వేందుకు ఈ ప్రాంతంలో 14 కిలీమీటర్ల రోడ్డు ఎలా వేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మైనింగ్ జరుగుతున్న ప్రాంతంలో 14 కిలీమీటర్లమేర 30 నుంచి 40 అడుగుల రోడ్డును మహాత్మగాంధీ ఉపాధిహామీ పధకం నిధులతో యంత్రాలతో రోడ్డు వేసిని ఘనత వైసీపీకే దక్కుతుంది.
ఎప్పటికైనా గిరిజన సంపదను గిరిజనులంతా ఏకమై కాపాడుకుంటాం, ఈ బాక్సైట్ తవ్వకాలను వెంటనే ఆపాలి లేకపోతే గిరిజనులంతా ఏకమై బాక్సైట్ తవ్వకాలకు పాల్పడుతున్న వారికి తగిన రీతిలో బుద్ది చెపుతామని ఆమె హెచ్చరించారు.