రక్త శుద్దికి, శరీర కణాల పునర్జన్మకు ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అలసటను తగ్గిస్తుంది. మెరుగుపరుస్తుంది. కాన్సర్ వ్యాధి పెరుగుదలను నివారిస్తుంది. గోధుమ గడ్డి రసం త్రాగడం వలన శరీరములోని విషపూరితాలన్నీ బయటికు విసర్జింపబడతాయి.
గోధుమ గడ్డి రసం ఆరోగ్యప్రదాయిని. దీనిని అనేక రోగాలకు నివారిణిగా ఉపయోగిస్తారు. ఒక గ్లాసు రసంలో 'ఎ' విటమిన్, బి కాంప్లెక్స, సి, ఇ, కె విటమిన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సెలీనియమ్, సోడియం, సల్ఫర్, కోబాల్ట్, జింక్, క్లోరోఫిల్ ఉంటాయి. దీనిలో కొలెస్ట్రాల్ ఉండదు. ఒక గ్లాసులోనే 17 ఎమినో యాసిడ్స్ ఫైబర్ ఎంజైమ్స్ ఉంటాయంటే ఇది ఆరోగ్యానికి ఎంత ఉపయోగకారో తెలుస్తుంది.
1. ఎర్ర రక్త కణాల అభివృద్ధి: గోధుమ గడ్డి రసం తాగితే ఎర్ర రక్త కణా లు అభివృద్ధి చెందుతాయి. దీనిలో బి12, ఫోలిక ఆసిడ్, ఐరన్ పుష్కలంగా ఉండి ఎర్ర రక్తకణాల పెరుగుదలకు దోహదం చేస్తాయి.