ప్రకాశం జిల్లాలో దారుణం.. బహిర్భూమికి వెళ్లిన యువతిపై అత్యాచారం

బుధవారం, 14 జులై 2021 (16:28 IST)
ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బహిర్భూమికి వెళ్లిన యువతిని అపహరించి ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం ఆవులమంద గ్రామానికి చెందిన ఓ ఇంట్లో మరుగుదొడ్డి లేదు. దీంతో ఆ ఇంట్లో కుటుంబంతో కలిసి నివాసముండే యువతి ప్రతిరోజూ గ్రామశివారులో బహిర్భూమికి వెళ్లేది. ఈ విషయాన్ని గమనించిన ఇద్దరు యువకులు ఆ యువతిపై దారుణానికి ఒడిగట్టారు. 
 
యువతి ఒంటరిగా బహిర్భూమికి వెళ్ళగా ఆమెను బైక్ పై ఫాలో అయ్యారు యువకులు. ఈ క్రమంలోనే యువతిని బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఓ యువకుడు యువతిపై అత్యాచారానికి పాల్పడగా మరొకరు కాపలాగా నిల్చున్నాడు.  
 
ఇంటికి చేరుకున్న తర్వాత యువతి తనపై జరిగిన అఘాయిత్యం గురించి కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యువతిని అపహరించి అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు