గోదావరి టు కావేరి- వయా నాగార్జున సాగర్​

శనివారం, 28 సెప్టెంబరు 2019 (07:31 IST)
తాగు, సాగు నీటి కష్టాలు తీర్చేందుకు బృహత్తర కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. నదుల అనుసంధానం ద్వారా దీనికి పరిష్కారం కనుగొన్నాయి. గోదావరి - కావేరిలను అనుసంధానించేందుకు కేంద్ర ప్రభుత్వం మూడేళ్లుగా కసరత్తు చేస్తోంది.

గోదావరి నుంచి కావేరికి 247 టీఎంసీల నీటిని మళ్లించడానికి రూ. 90,562.56 కోట్లు వ్యయమవుతుందని జాతీయ జల అభివృద్ధి సంస్థ అంచనా వేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లో నదుల అనుసంధానం పథకాలు జోరందుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం గోదావరి - కావేరి అనుసంధానంపై మూడేళ్లుగా కసరత్తు చేస్తోంది.

మొదట అకినేపల్లి నుంచి మళ్లించాలని భావించారు. దీనికి సానుకూలత వ్యక్తం కాలేదు. వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలించి చివరకు జానంపేట నుంచి సాగర్‌కు పైప్‌లైన్‌ ద్వారా మళ్లించడం మేలని భావిస్తోంది.

నీటిని మళ్లించడానికి రూ. 90,562.56 కోట్లు ఖర్చు గోదావరి నుంచి కావేరికి 247 టీఎంసీల నీటిని మళ్లించడానికి రూ. 90,562.56 కోట్లు వ్యయమవుతుందని జాతీయ జల అభివృద్ధి సంస్థ అంచనా వేస్తోంది. చివరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జానంపేట నుంచి నాగార్జునసాగర్‌ వరకు పైపులైన్‌ ద్వారా నీటిని తరలించడానికే మొగ్గు చూపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు