లెక్క సరిపోయింది బాబూ.. ఆ 23కి ఈ 23తో సరిపెట్టిన జగన్

శుక్రవారం, 24 మే 2019 (12:36 IST)
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ పార్టీ ప్రభంజనాన్ని సృష్టించింది. 175 అసెంబ్లీ స్థానాల్లో 151 స్థానాల్లో విజయఢంకా మోగించి తెలుగుదేశం, జనసేన పార్టీలకు చుక్కలు చూపించింది. 25 లోక్‌సభ స్థానాలకు 22 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఊహించని విజయాన్ని అందుకున్నారు. 
 
కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో వైసీపీ  క్లీన్‌స్వీప్‌ చేసిందంటే జగన్ సునామీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సునామీలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇదిలావుంటే, వైసీపీ పార్టీ గుర్తుపై గెలిచి, పార్టీ ఫిరాయింలు ద్వారా తెలుగు దేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు అందరూ అదే వైసీపీ చేతులో ఓటమిపాలవడం విశేషం. 
 
వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా గాలం వేసింది. అయతే వీరంతా తాము పోటీ చేసిన నియోజకవర్గాల్లో దారుణ పరాజయాలు పాలవడం ఒకఎత్తయితే.. తాజాగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలుచుకుంది. 
 
దీనిపై స్పందిచిన వైసీపీ నాయకులు మా లెక్క సరిపోయిందని మాదగ్గర నుంచి అన్యాయంగా చంద్రబాబు 23 మందిని తీసుకెళ్లాడని అదే 23 మంది ఇప్పుడు చంద్రబాబుకు మిగిలారని అంటున్నాయి వైసీపీ వర్గాలు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు