తెలుగు యువతకు ప్రాధాన్యాన్నిస్తే ప్రభుత్వ ప్రోత్సాహం : ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి

శనివారం, 1 ఆగస్టు 2020 (19:06 IST)
ఐ.టీ సంస్థలలో తెలుగు యువతకు ప్రాధాన్యతనిస్తే ప్రభుత్వ ప్రోత్సాహం తప్పక ఉంటుందని ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఒక్కరోజు చెప్పుకోవడానికి అన్నట్లు కాకుండా చెక్కుచెదరని స్టార్టప్ లకే పెద్దపీట వేస్తామని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు.

'స్కిల్ గ్యాప్' సమస్య పరిష్కారానికి ఒక కమిటీ నియమించి, నివేదిక ప్రకారం కరికులమ్ లో మార్పులకు శ్రీకారం చుడతామని మంత్రి తెలిపారు. పరిపాలన విధానంలో కొత్త ఒరవడి సృష్టించేందుకు ఐఎస్ బీ తో ప్రభుత్వం భాగస్వామ్యమైట్లు మంత్రి పేర్కొన్నారు. 
 
కోవిడ్ విజృంభణపై భవిష్యత్ లో జరగబోయేది ముందే చెప్పి ప్రజలను అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దార్శనికతను మంత్రి కొనియాడారు.  కోవిడ్ కలిసి బతకాల్సిందేనని ప్రజలను అప్రమత్తం చేసిన ఏకైక తొలి సీఎం అని పరీక్షలు, దేశంలోనే టాప్ లో నిలబడిన వివరాలను ప్రస్తావించారు.

పెట్టుబడులు తీసుకురావడం కన్నా ముందు పెట్టుబడి పెట్టాలంటే అవసరమైన సదుపాయాలను కల్పించడంపై దృష్టిపెట్టినట్లు మంత్రి పేర్కొన్నారు.
 
కోవిడ్ నేపథ్యంలో తీసుకుంటున్న జాగ్రత్తలతో వైద్యరంగాన్ని ముఖ్యమంత్రి మరో మెట్టుపైన నిలబెట్టారు. ఆచరణ సాద్యం కాని హామీలతో గత ఐదేళ్లలో పరిశ్రమల స్థాపన పెద్దగా జరగకపోవడంపై ముఖ్యమంత్రికి ఆలోచనలను మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.

గత ప్రభుత్వం అనుభవం ద్వారా  అబద్ధాల మాటలు, ప్రచారం కోసం ప్రగల్భాలు పలకవద్దనేదే మా ప్రభుత్వం ముందు నుంచి పెట్టుకున్న నియమం, లక్ష్యమని మంత్రి తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు