తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచితాలన్నీ రద్దు చేయాలని కోరారు. ఉచితాలతో ప్రజలను సోమరిపోతులు చేయొద్దనీ, ప్రతి ఒక్కరికీ సంపాదించే శక్తినిచ్చి, ఆర్థిక స్వావలంబన సాధించేలా ప్రోత్సహించాలని కోరారు.
హైదరాబాదులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఎఫ్ ట్యాప్సీ) శతాబ్ది ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు పల్లె సీమలను పట్టణాల మాదిరిగా తీర్చిదిద్దేందుకు పాటు పడాలన్నారు. తమ సీఎస్ఆర్ నిధులను పట్టణాలకు కాకుండా గ్రామీణ ప్రాంతాలకు తరలించాలని ఆయన సూచించారు.
నిజానికి ప్రజలు అడక్కున్నప్పటికీ.. ప్రభుత్వాలు మాత్రం పోటీ పడుతూ ఉచితాల మంత్రాన్ని పఠిస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఉచితానికి మంగళం పాడి, ప్రజలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు.