తాగిన మైకంలో రోకలితో మోది భార్యను హతమార్చాడో కసాయి. ఈ సంఘటన దేవరకొండ పట్టణంలో శనివారం వెలుగులోకి వచ్చింది. మృతురాలి కుటుంబ సభ్యుల, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని సంజయ కాలనీకి చెందిన నీల నిరంజన, సుగునమ్మల కుమార్తె మంగమ్మ(30)ను గుంటూరు జిల్లా గుర జాల మండలం గొట్టిముక్కల గ్రామానికి చెందిన ఆడేపు శివయ్యతో పది సంవత్సరాల క్రితం వివాహం చేశారు.
పోలీసులు వచ్చి రక్తం మడుగులో పడి ఉన్న మంగమ్మను ఆస్పత్రికి తరలించారు. శివయ్యను అదుపులోకి తీసుకుని, మంగమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందింది.
మరోవైపు గుడంబాకు బానిసైన ఓ గిరిజనుడు తాగిన మైకంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని జామతండ శివారు తారాసింగ్ బావితండాలో శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్సై గోదారి రాజ్‌కుమార్ కథనం ప్రకారం.. తండాకు చెందిన గుగులోతు వీరు నాయక్(35) తనకున్న రెండెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందుల తో గుడుంబాకు బానిసై ఇంట్లోఎవరూ లేని సమయంలో ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.