తెనాలిలోని ఇందిరా కాలనీకి చెందిన ఓ మహిళ తన భర్త వద్ద విడాకులు తీసుకోకుండానే కుమార్తెతో కలిసి 2009 నుంచి ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతను కూడా భార్యకు విడాకులు ఇవ్వకుండానే.. తన బిడ్డతో కలిసి ఉంటున్నాడు. ఇలా ఆ మహిళ, ఇతని మధ్య ఏర్పడ్డ పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. ఇద్దరు అమ్మాయిలను అతనే బీటెక్ చదివించాడు.
అయితే గత కొంత కాలం నుంచి తన ప్రియురాలితో అతనికి గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆమె కూతురు స్నానం చేస్తుండగా.. గుట్టుగా వీడియోలు చిత్రీకరించాడు. ఇప్పుడు వాటిని అడ్డుపెట్టుకుని ఆమెను బెదిరిస్తున్నాడు. కానీ బాధిత మహిళ గుంటూరు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.