కరోనాతో శవాలదిబ్బగా మారిన గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ మార్చురీ

మంగళవారం, 28 జులై 2020 (19:53 IST)
గుంటూరు జిల్లాను కరోనా మహమ్మారి గడగడలాడిస్తున్నది. రోజురోజుకి మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నది. గుంటూరు జీజీహెచ్ లోని మార్చురీ కరోనా మృతదేహాలతో నిండి పోయింది. కరోనాతో చనిపోయిన వారిని తీసుకెళ్లేందుకు బంధువులు భయపడుతున్నా రు. దీంతో జీజీహెచ్ మార్చురీ శవాల దిబ్బగా మారింది.
 
జీజీహెచ్ మార్చురీలో 30 మృత దేహాలు భద్రపరిచే అవకాశమున్నది. కానీ ప్రస్తుతం మార్చురీలో 54 మృతదేహాలున్నాయి. గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు వందకు పైగా కరోనా వైరస్‌కు బలయ్యారు. కరోనాతో చనిపోయిన కుటుంబ సభ్యులు సైతం క్వారంటైన్, కోవిడ్ సెంటర్ ఆస్పత్రులలో ఉంటున్నారు. మరోవైపు కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియలో పాల్గొన్నవారికి కరోనా సోకింది.
 
దీంతో కరోనాతో మృతదేహాలను స్వీకరించడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. కరోనా మృతదేహాల అంత్యక్రియలకు ఇబ్బందులు కలగకుండా జిల్లా అధికార యంత్రాంగం గట్టి చర్యలను తీసుకుంటున్నది. దీంతో కరోనా మృతదేహాల అంత్యక్రియలకు సంబంధించిన చర్యలను ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు జీజీహెచ్ సూపరిండెంట్ సుధాకర్.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు