హ్యాపీ యానివర్సరీ మామ్ అండ్ డాడ్ : నారా లోకేశ్

సోమవారం, 10 సెప్టెంబరు 2018 (10:37 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం పెళ్లిరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. 1981 సెప్టెంబరు పదో తేదీన నందమూరి భువనేశ్వరిని నారా చంద్రబాబు నాయుడు వివాహమాడారు. ఈ దంపతులకు నారా లోకేశ్ ఏకైక కుమారుడు. ఈ పెళ్లి రోజును పురస్కరించుకుని లోకేశ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
 
'అమ్మా, నాన్నా హ్యాపీ యానివర్సరీ. ఇటువంటి వార్షికోత్సవాలను మరెన్నో మీరు జరుపుకోవాలని కోరుకుంటున్నా. ఒకరిపై ఒకరు ఇదే విధమైన ప్రేమ, ఆప్యాయతలను ఒకరిపై ఒకరు చూపుతూ, పర్ఫెక్ట్ కపుల్‌గా ఆదర్శంగా నిలవాలి' అంటూ ట్వీట్ చేశారు.
 
కాగా, 1981 సెప్టెంబర్ 10వ తేదీన అప్పటి సినిమాటోగ్రఫీ, పురావస్తు శాఖ మంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, నాటి సీఎం ఎన్.టి. రామారావు కుమార్తె భువనేశ్వరికి చెన్నైలోని కళైవానర్ ఆరంగం ఆడిటోరియంలో వివాహం వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు