"పుష్ప" పాట 'ఊ అంటావా..' కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసు

శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (15:24 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్‌ ఆచార్యపై ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేసింది. తనను శృంగారంలో పాల్గొనాలని గణేష్ బలవంతం చేశారంటూ ఆరోపించింది. ఇదే అంశంపై ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు గణేష్‌పై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
 
అయితే, ఈ ఫిర్యాదు గత 2020లో చేయగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. తనకు పోర్న్ వీడియోలు చూపించి, ఎంతో వేధించారని పేర్కొంది. తనతో శృంగారం చేయడానికి అంగీకరించకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించాడని ఆమె ఆరోపించింది. 
 
ఆరు నెలల కాలంలోనే ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్‌లో సభ్యత్వాన్ని రద్దు చేయించారని బాధితురాలు వాపోయింది. ఈ వేధింపులు తట్టుకోలేకే తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. దీంతో ఆమెపై ఐపీసీ 354ఏ, 354సి, 354డి, 509, 323, 504 వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు