తిరిగేది పరదాల చాటున, అయినా 986 మంది సెక్యూరిటీయా? మాజీ సీఎం జగన్ పైన సీఎం చంద్రబాబు (video)

ఐవీఆర్

శుక్రవారం, 28 జూన్ 2024 (19:55 IST)
ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఎంతగా భ్రష్టుపట్టించారో జరిగినవి చూస్తుంటే అర్థమవుతోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేస్తూ సీఎం చంద్రబాబు పలు విషయాలు చెప్పుకొచ్చారు. ఒక సీఎంగా చేసిన వ్యక్తికి 986 మంది సెక్యూరిటీ సిబ్బంది కావాలా? మనమేమన్నా రాజులమా? ఎక్కడనుంచైనా ఊడిపడ్డామా? సామాన్య మనుషులం అంతే. ప్రజలకు సేవ చేసేందుకు వారితో ఎన్నిక చేయబడినవారం.
 
అందుకే నేను మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా చెప్పాను. చాలా సింపుల్‌గా వుండమన్నాను. నేను వెళ్తున్నా కూడా రోడ్డుకి ఇరువైపులా పరదాలు కట్టేస్తున్నారు. మీకేమైనా పిచ్చిపట్టిందా ఎందుకిలా పరదాలు కడుతున్నారు అని అంటే, అలవాటైపోయింది సార్ అంటున్నారు. ప్రజలతో ఎన్నుకోబడింది పరదాలు కట్టుకుని తిరగడానికి కాదు, చుట్టూ వేలమంది భద్రత సిబ్బందిని పెట్టుకోవడానికి కాదు. ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను పరిష్కరించడానికి అని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.

పరదాలు కట్టుక్కు తిరిగే దానికి 986 మంది సెక్యూరిటీ ఎందుకు? చెట్లు కొట్టేయడం ఎందుకు?

"నేను వెళ్ళినా పరదాలు కట్టేస్తున్నారు. ఏమన్నా పిచ్చి పట్టిందా అంటే... అలవాటు అయిపొయింది అంటున్నారు"

- @ncbn #YSJagan pic.twitter.com/6qHO4XavMa

— M9 NEWS (@M9News_) June 28, 2024

"వీళ్ళకు పోలవరం అంటే ఒక నవ్వులాట అయిపోయింది". జగన్, అంబటి పోలవరం పై మాట్లాడిన మాటలు మీడియా ముందు చూపిస్తూ, సియం చంద్రబాబు గారు.#PolavaramProject #NaraChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/uQnsvXi5yr

— Telugu Desam Party (@JaiTDP) June 28, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు