అలాగే, వాయుగుండంగా మారిన తర్వాత తీరం వెంబడి 40-45 కిలోమీటర్ల మేరకు ఈదురు గాలులు వీస్తాయన, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది.
అలాగే, వచ్చే మూడు రోజుల పాటు చలితీవ్రత పెరగనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వచ్చే నాలుగు రోజుల వరకు చలి ఎక్కువగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వెదర్‌మేన్ రిపోర్టు వెల్లడించింది. ఉత్తర భారత దేశం నుంచి చల్లటి గాలులు దిగువకు లాగుతాయని, అందువల్ల వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతుందని తెలిపారు.