ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము కోసం మద్దతు తెలిపిన తొలి నటుడు కృష్ణ

మంగళవారం, 15 నవంబరు 2022 (10:49 IST)
krishna, potti sriramulu
సూపర్ స్టార్ అనే పదం.మొదటి గా వినిపించినా ఇప్పటికీ,  ఎప్పటికీ సూపర్ స్టార్ అనే పదం విన్న ప్రతి సారీ తెలుగు ప్రజల మదిలో మెదిలే   ప్రముఖ చలన చిత్ర  నటుడు, నిర్మాత, దర్శకుడు, స్టూడియో అధినేత... సినీ అభిమానులు సూపర్ స్టార్ గా పిలుచుకునే సినీ హీరో కృష్ణ (ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి, 79 ) గారి మరణం పట్ల తెలుగు ప్రజలతో పాటూ మెము కూడా శోక సముద్రంలో ఉన్నాము. నటుడు గా, నిర్మాత గా,  దర్శకుడు గా, నిర్మాణ సంస్థ అధినేతగా, తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాలపాటు కృష్ణ గారు సినీ పరిశ్రమకు అందించిన సేవలను మరువ లేము. 
 
నాటి కార్మిక కర్షక లోకం, మహిళలు, యువకులు కృష్ణ గారిని తమ అభిమాన హీరో గా, సూపర్ స్టార్ గా సొంతం చేసుకుని మదిలో స్థానం కల్పించారు. పద్మాలయా స్టూడియోస్ తొ సొంత నిర్మాణ సంస్థను స్థాపించి, సినిమా నిర్మాణ రంగంలో నూతన  ఒరవడులను ప్రవేశ పెట్టిన ఘనత కృష్ణ గారిది. 
 ఆయనలో మరో కోణం ఉంది. అదే ధైర్యం. మొదటినుంచి ఆయనకున్న ఆయుధం అదే. ప్రత్యేక  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము కోసం  పొట్టి శ్రీరాములు గారు దీక్ష చేస్తుంటే  అప్పట్లో సినిమా ఇండస్ట్రీ (చెన్నై లో ఉండేది ) నుండి ఒక్కరు కూడా మద్దతు ఇచ్చే వారు కాదు కానీ  మొదటిసారిగా  కృష్ణ  గారు ధైర్యం గా బయటకి వచ్చి ఆయనకు మద్దతు గా కూర్చున్నారు. ఇదే అప్పటి ఫోటో. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు