తడిసి ముద్దయిన విజయవాడ - ఏకధాటిగా కురిసిన వర్షం

ఆదివారం, 19 జూన్ 2022 (16:51 IST)
గత కొన్ని రోజులుగా సూర్యతాపానికి తల్లడిల్లిపోయిన విజయవాడ నగర వాసుల పట్ల వరుణ దేవుడు చల్లనిచూపు చూశాడు. ఆదివారం విజయవాడ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. దాదాపు గంటకు పైగా ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమైపోయాయి. ముఖ్యంగా, నగరంలోని ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. బెంజ్ సర్కిల్, రాణిగారి తోట, ఎంజీరోడ్డు, కృష్ణలంక, ఏలూరు రోడ్డు, మొగల్రాజపురంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. 
 
అంతేకాకుండా, విజయవాడ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ వర్షం దెబ్బకు రోడ్లపై వర్షపు నీరు నిలిచింది. నీళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో స్థానికులతో పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్క గంట కురిసిన భారీ వర్షానికే రోడ్లన్నీ జలమయం కావడంతో నగర వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ  మరమ్మతులు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు