ఏపీలో మూడురోజులపాటు భారీ వర్షాలు... అల్పపీడన ప్రభావం

శుక్రవారం, 14 ఆగస్టు 2020 (16:21 IST)
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం తీవ్రంగా కనబడుతున్నది. అల్పపీడన వ్రభావం వలన ఇప్పటికే కోస్తా రాయలసీమ జిల్లాలలో మూడు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఇవి మరింత తీవ్రమై భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
 
రాబోయే మూడు రోజులకు భారీ వర్షాలు తప్పవని అధికారులు ప్రకటించారు. వాయువ్య బంగాళాఖాతంలో రేపు పూర్తి స్థాయిలో అల్ప పీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. దీంతో 3.5 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడే అవకాశముందని తెలిపింది.
 
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు ఓ ప్రకటనలో తెలిపారు. మత్స్యకారులు ముఖ్యంగా వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ముఖ్యంగా తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలలో అధిక వర్షపాతానికి అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు