వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు సీబీఐ కోర్టులో పిటీషన్‌ను దాఖలు చేశారు. బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన ఇంటర్వ్యూలో తనకు ఎలాంటి సంబంధం లేదని జగన్ పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణను ప్రభావితం చేసేలా జగన్ వ్యవహరించారంటూ ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టు సీబీఐ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌కు శుక్రవారం నాడు జగన్ కౌంటర్‌ను దాఖలు చేశారు.
దర్యాప్తును ఏ రకంగాను ప్రభావితం చేయలేదని కోర్టుకు సమర్పించిన కౌంటర్ పిటిషన్‌లో జగన్ తరపు న్యాయవాదులు స్పష్టం చేశారు. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను వెంటనే డిస్ మిస్ చేయాలని కోరారు. ఈ కేసు విచారణ ఈ నెల 21వ, తేదికి వాయిదా పడింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. పత్రికా స్వేచ్ఛకు అనుగుణంగానే ఇంటర్వ్యూను తీసుకున్నట్లు తెలిపారు. ఎక్కడా కూడా ఆస్తులకు సంబంధించిన కేసులను ప్రస్తావించలేదని తెలిపారు. తనను క్లయింట్ కేసును ప్రభావితం చేస్తున్నారంటూ చేసిన వాదనలో వాస్తవం లేదన్నారు.