గాంధీ జయంతి సందర్భంగా ఏపీలో శ్రమదానం చేసేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సిద్ధమైయ్యారు. దీంతో రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. శనివారం తూర్పుగోదావరి జిల్లా, అనంతపురం జిల్లాల్లో పవన్‌కల్యాణ్ పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది.
రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై ఆక్టోబర్ 2న శ్రమదానం చేయాలని నిర్ణయించారు. తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరంలోని ఆర్థర్ కాటన్ బ్యారేజీపై, అనంతపురం జిల్లా కొత్తచెరువలో పవన్ శ్రమదానం చేస్తానని ప్రకటించారు. ఇందుకు సంబందించిన ఏర్పాట్లును జనసైనికులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
అయితే, కాటన్ బ్యారేజీ వద్ద పవన్ కార్యక్రమానికి ఇరిగేషన్ శాఖ అధికారులు అనుమతి ఇవ్వలేదు. బ్యారేజీపై మరమ్మతులు చేయడానికి వీల్లేదని.. గుంతలు పూడిస్తే బ్యారేజీ నష్టమని తెలిపారు. అంతేకాకుండా కాటన్ బ్యారేజీ ఆర్ అండ్ బీ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు.