ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యభిచారిణిలు కూడా బాగా వాడేసుకుంటున్నారు. వ్యభిచారం చేసేందుకు తమ వద్దకు వచ్చే విటుల్లో తెలిసిన వారు ఉంటే తమ పరువు పోతుందని భావించిన అమ్మాయిలు, ఆంటీలు... ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులోభాగంగా తొలుత విటుల ఫోటోలను వాట్సాప్‌లో పంపించమని కోరుతున్నారు. ఆ విటుడు నచ్చితేనే అతనికి పడకసుఖం అందించేందుకు వ్యభిచారిణిని సమ్మతిస్తోంది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ జిల్లాలో వెలుగు చూసింది.
జయశంకర్ జిల్లాలో హైటెక్ వ్యభిచార కార్యకలాపాలు సాగుతున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా గృహాలను అడ్డాగా చేసుకొని ఈ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు బహిరంగంగా వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో వ్యభిచార బ్రోకర్లు మాత్రమే కాదు... వ్యభిచారిణిలు కూడా హైటెక్ టెక్నాలజీని వాడుతున్నారు. పేదరికంతో కొందరు వ్యభిచార కూపంలోకి దిగుతుంటే.. మరికొందరు మరింత విలాసవంతమైన జీవితం కోసం ఈ వృత్తిని ఎంచుకుంటున్నారు. ఇందుకోసం తమ నివాసాలనే సురక్షితమైన అడ్డాగా ఎంచుకుంటున్నారు.
పైగా, వ్యభిచారం జరుగుతున్నట్లు ఎవరికీ అనుమానం రాకుండా నిర్వాహకులు కొన్ని గృహాలనే అడ్డాలుగా మార్చుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కేంద్రంలోని కృష్ణకాలనీ, శాంతినగర్, జవహర్‌నగర్‌కాలనీ, బాంబులగడ్డ తదితర ప్రాంతాల్లో ఈ దందా నడుస్తున్నట్లు వార్తలు రావడంతో పోలీసులు దృష్టిసారించారు.